MBNR: గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నూతన ఛైర్పర్సన్ గద్వాల సరిత తిరుపతయ్యను సంఘం జిల్లా ఛైర్మన్ శాంతయ్య యాదవ్ ఆధ్వర్యంలో నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మహబూబ్‌నగర్‌కు జిల్లాకు మంజూరు కావాల్సిన ఎన్సీడీసీ (NCDC) రుణాలను తక్షణమే విడుదల చేసి, క్షేత్రస్థాయిలో గొర్రెల కాపరుల కుటుంబాలకు ఆర్థిక చేయూతనివ్వాలని వారు కోరారు.