PDPL: కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మళ్ళీ జీవన్ ప్రమాణ పోర్టల్లో పునరుద్ధరించినట్లు సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వేణుమాధవ్ ఒక ప్రకటనలో తెలిపారు. అయితే, ఇటీవల సింగరేణి రిటైర్డ్ కార్మికుల జీవన్ ప్రమాణ పోర్టల్ పనిచేయలేదని, దీంతో చాలామంది పెన్షనర్లు ఆన్లైన్లో తమ ధ్రువీకరణ పత్రాలను సమర్పించలేకపోయారని పేర్కొన్నారు.