MBNR: జడ్చర్లలో అకాల వర్షం, ఈదురు గాలులకు పోలేపల్లి–కావేరమ్మపేట రహదారిపై విద్యుత్ వైర్లు తెగిపడ్డాయి. 3 రోజులుగా లైన్మెన్, ఏఈకి ఫోన్ చేసినా స్పందన లేదని రైతులు వాపోయారు. కరెంట్ లేక పశువులు, ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడుతున్నారు. పొలాల మధ్యలో వైర్లు వాలిపోవడంతో ప్రమాద భయం నెలకొంది. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.