SKLM: వజ్రపుకొత్తూరు మండలం రాజాంలో యువ చైతన్య ఆర్ట్స్ యువజన సేవా సంఘం వార్షికోత్సవం సందర్భంగా ఈ నెల 29 నుంచి 31 వరకు జిల్లాస్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీలలో గెలుపొందినవారికి బహుమతులు ప్రధానం చేయనున్నారు. ఆసక్తి కలిగిన వారు తమ టీం వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.