AP: మహానాడు అంటే కార్యకర్తల పండుగ అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘వర్చువల్ వల్ల వాహనాల జోరు తగ్గిందేగానీ.. మీలో జోష్ తగ్గలేదు. క్లస్టర్ల నుంచి లక్షలాదిమంది పాల్గొన్నారు. మారింది మీటింగ్ విధానమే.. మహానాడు విధానాలు కాదు. మహానాడులో అన్ని అంశాలపై చర్చించి, ఫలితాలను సమీక్షించుకుందాం. భవిష్యత్ ప్రణాళికలు ప్రకటించుకుందాం. సంక్షేమం, అభివృద్ధిని పరిచయం చేసింది టీడీపీనే’ అని తెలిపారు.