అన్నమయ్య జిల్లా ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదనపల్లె జెడ్పీ గ్రౌండ్లో మంగళవారం సీనియర్ మెన్ జిల్లా జట్టు ఎంపికలు జరిగాయి. ఈ ట్రయల్స్‌లో 50 మందికి పైగా క్రీడాకారులు పాల్గొనగా, ప్రతిభ కనబరిచిన 30 మందిని ప్రత్యేక కోచింగ్ క్యాంప్‌నకు ఎంపిక చేశారు. క్యాంప్ అనంతరం రాష్ట్ర స్థాయి పోటీలకు తుది 20 మందితో జట్టును ప్రకటించనున్నారు.