పిల్లలు గంటల తరబడి ఫోన్లు చూడటం వల్ల కంటిచూపు, మెడనొప్పి, ఊబకాయం, నిద్రలేమి, ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలొస్తాయి. డిజిటల్ ప్రపంచంలో మునిగిపోతే ఒంటరితనం, కోపం పెరుగుతాయి. కాబట్టి, స్క్రీన్ టైమ్ను రోజుకు 1 గంటలోపు పరిమితం చేయాలి. ఫోన్కు బదులుగా బయట ఆడుకునే ఆటలు, పుస్తకాలు చదవడం, సృజనాత్మక అలవాట్లను ప్రోత్సహించాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు ఫోన్ వాడకం తగ్గించాలి.