HYD: వేసవి రద్దీ దృష్ట్యా చర్లపల్లి-దానాపూర్ మార్గంలో వన్ వే ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఇవాళ మధ్యాహ్నం 1 గంటకు చర్లపల్లిలో బయలుదేరే ఈ రైలు (07089) గురువారం రాత్రి 11.55 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది. ఇది ఖాజీపేట్, రామగుండం, ప్రయాగ్రాజ్, బక్సర్, ఆరాతో పాటు పలు కీలక స్టేషన్లలో ఆగుతుందని సీపీఆర్డీ శ్రీధర్ తెలిపారు.