CTR: తెలుగుదేశం పార్టీ కుటుంబ పండుగ మహానాడు కార్యక్రమం చిత్తూరు నియోజకవర్గ పరిధిలో బుధవారం ఘనంగా ప్రారంభమైంది. చిత్తూరు 3వ క్లస్టర్ సమావేశంలో ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ పాల్గొని టీడీపీ జెండా ఎగురవేశారు. క్లస్టర్, డివిజన్ ఇంఛార్జ్లు, పార్టీ ప్రధాన కమిటీ, అనుబంధ కమిటీల సభ్యులు, భారీగా కార్యకర్తలు పాల్గొన్నారు.