AP: సుమారు కోటిమందికి సభ్యత్వం ఉన్న పార్టీ టీడీపీ అని పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ పల్లా శ్రీనివాసరావు తెలిపారు. కష్టపడిన కార్యకర్తలకు పార్టీలో గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ రాజకీయాలను శాసించే నాయకత్వం తమకు ఉందని అన్నారు. భవిష్యత్తుకు భరోసా కల్పించే నాయకత్వం టీడీపీ సొంతం అని ధీమా వ్యక్తం చేశారు.