AKP: నర్సీపట్నం, మాకవరపాలెం మండలంలో అంగన్వాడీ టీచర్లు, కార్యకర్తల పోస్టులకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన పూర్తయిందని ఐసీడీఎస్ సీడీపీవో రమణి తెలిపారు. నర్సీపట్నం మండలంలో 22 దరఖాస్తులు, మాకవరపాలెం మండలంలో 29 దరఖాస్తులు అందినట్లు పేర్కొన్నారు. త్వరలో ఇంటర్వ్యూల తేదీ ప్రకటిస్తామని, అభ్యర్థులు తమ ఒరిజినల్ పత్రాలతో హాజరుకావాలని ఆమె సూచించారు.