ASR: రాజవొమ్మంగి మండలం దుర్గానగర్ వద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొమరాపురం వస్తుండగా పాండవుల ఉమాశంకర్ వరప్రసాద్ (23) అనే గిరిజన యువకుడు మృతి చెందాడు. ప్రమాదంలో గాయపడిన అతన్ని జడ్డంగి పీహెచ్సీకి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించినట్లు డాక్టర్ నాగార్జున ధ్రువీకరించారు. ఘలనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.