SRD: సిర్గాపూర్ మండలం రైతులకు పచ్చిరొట్టె ఎరువుల కోసం జీలుగ విత్తనాలు 50 శాతం సబ్సిడీపై అందుబాటులో ఉన్నాయని AO హరికృష్ణ తెలిపారు. నేటి నుంచి బొక్కస్ గాం PACSలో పంపిణీ ప్రారంభమవుతుందని చెప్పారు. 30 కిలోల జీలుగ విత్తనాల బ్యాగ్ ధర రైతు వాటాగా రూ. 2,452 కాగా, ఒక బ్యాగ్ 2–2.5 ఎకరాలకు సరిపోతుందని తెలిపారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు.