KDP: జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాలతో జిల్లావ్యాప్తంగా నైట్ పెట్రోలింగ్ ముమ్మరం చేశారు. నేరాల నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాల కట్టడిపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. లాడ్జిల్లో తనిఖీలు నిర్వహించి, అనుమానితులు, పాత నేరస్తులపై నిఘా పెంచారు. తాళాలు వేసిన ఇళ్ల వద్ద ప్రత్యేక గస్తీ ఏర్పాటు చేసి దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టారు.