BDK: పవిత్ర బక్రీద్ పండుగను జిల్లాలోని ముస్లిం సోదరులందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో,ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఖాన్ ఇవాళ ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పండుగ పవిత్రతను కాపాడుకుంటూనే, ప్రభుత్వ నిబంధనలకు మరియు చట్టానికి లోబడి ప్రతి ఒక్కరూ వ్యవహరించాలన్నారు.