TG: సిద్దిపేటలోని చిన్నకోడూరులో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. నెలరోజులుగా కాంటాలు వేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని హరీష్ మండిపడ్డారు. బాధ్యతలు విస్మరించి BJP, కాంగ్రెస్‌లు డ్రామాలు చేస్తున్నాయని ధ్వజమెత్తారు.