MBNR: బాలానగర్ మండలం ఉడిత్యాల గ్రామంలో కురిసిన భారీ వర్షానికి సుమారు 300 బస్తాల ధాన్యం తడిసిపోయిందని గ్రామస్థులు తెలిపారు. 5–6 రోజులుగా లారీలు రాకపోవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రంలోనే నిల్వ ఉందన్నారు. సమయానికి లారీలు వచ్చి ఉంటే నష్టం తప్పేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధాన్యం నాణ్యత దెబ్బతింటోందని ఆందోళన చెందుతున్నారు.