IPL- 2026 సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్ కోసం SRH, RR సిద్ధమవుతున్నాయి. అయితే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఔట్ చేసేందుకు మూడు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వెల్లడించాడు. ప్లాన్ A వర్కౌట్ కాకపోతే.. ప్లాన్ B లేదా ప్లాన్ C అమలు చేస్తామన్నాడు. లీగ్ దశలో RRను రెండుసార్లు చిత్తు చేసిన ‘SRH’.. ఎలిమినేటర్లోనూ అదే జోరు కొనసాగించాలని చూస్తోంది.