ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని బాబు జగజ్జీవన్ రావు హాల్లో నిర్వహించిన వర్చువల్ మహానాడు కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలుగు జాతి గర్వించదగ్గ మహనీయుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని ప్రతి ఏడాది మహానాడు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు.