KMM: అభివృద్ధి ముసుగులో మధిర మున్సిపాలిటీలో ప్రభుత్వ ఖజానాకు అధికార పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు గండి కొడుతున్నారని సిపిఎం డివిజన్ కార్యదర్శి మడిపల్లి గోపాలరావు అన్నారు. బుధవారం బోడెపుడి భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మధిర జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల్లో అవినీతి జరుగుతుందని, ఈ విషయంపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.