TG: అకాల వర్షాలపై బీజేపీ చీఫ్ రాంచందర్రావు స్పందించారు. కొనుగోలు కేంద్రాల దగ్గర కనీస సౌకర్యాలు లేవని మండిపడ్డారు. వర్షాలకు ధాన్యం తడిచి రైతులు ఆందోళనలో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. రైతు సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.