NGKL: లింగాల మండల వ్యవసాయ అధికారి అనిల్ రైతులు పంట పొలాల్లో గడ్డిని కాల్చకూడదని సూచించారు. ఇలా చేయడం వల్ల భూసారం దెబ్బతిని వానపాములు, మిత్రపురుగులు చనిపోతాయని తెలిపారు. భూమి నిస్సారమవుతుందని, వాయు కాలుష్యం పెరుగుతుందని హెచ్చరించారు. గడ్డిని భూమిలో కలపడం లేదా బయో-డీకంపోజర్తో సేంద్రియ ఎరువుగా మార్చుకోవాలని సూచించారు.