TG: హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఇవాళ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పర్యటించనున్నారు. ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను ఆయన పరిశీలించనున్నారు. నాంపల్లిలో పాత ప్రభుత్వ క్వార్టర్స్‌ను సందర్శించనున్నారు. మలక్‌పేట్‌లో ఖాళీ స్ధలాలపై మంత్రి ఫోకస్ పెట్టనున్నారు. బహదూర్‌పురాలో శిథిల భవనాలను తనిఖీ చేయనున్నారు.