ADB: హైదరాబాద్‌లోని రామంతాపూర్, బేగంపేట పబ్లిక్ స్కూల్లో ఒకటో తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతున్నట్లు కలెక్టర్ రాజర్షి షా బుధవారం తెలిపారు. జిల్లాలోని అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఈనెల 29లోపు ఆదిలాబాద్‌లోని ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆసక్తి గల వారు ఇతర వివరాల కోసం నేరుగా కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.