AP: ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ అనే బుక్లేట్ను మాజీ సీఎం జగన్ విడుదల చేశారు. ‘ప్రజలను బాబు ఎలా మోసం చేశారనేది ఇందులో వివరంగా ఉన్నాయి. ఆయన అవినీతి మొత్తం క్లుప్తంగా అందరికీ అర్థమయ్యే విధంగా రూపొందించాం. దీని గురించి మనం చదువడంతో పాటు పార్టీ కార్యకర్తలకు వివరించాలి. దానితో పాటు టీడీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రజలకు చూపించాలి’ అని పార్టీ నేతలకు సూచించారు.