MDK: చందంపేట సొసైటీ ఉద్యోగి కిష్టారెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా సహకార అధికారి కరుణాకర్ ఆదేశాలు జారీచేశారు. కిష్టారెడ్డి 2018లో మేనేజింగ్ కమిటీ తీర్మానంతో తాత్కాలిక ఉద్యోగిగా చేరినట్లు వివరించారు. ఈ విషయంలో ప్రవీణ్ ఫిర్యాదు చేయడంతో సీనియర్ ఇన్స్పెక్టర్ యాకూబ్ అలీ విచారణ చేపట్టారు. కిష్టారెడ్డి అక్రమంగా నియామకమైనట్లు గుర్తించి సస్పెండ్ చేశారు.