NLG: నాగార్జునసాగర్ ప్రాజెక్టు గరిష్ఠ స్థాయి 590 అడుగులు కాగా, ప్రస్తుతం 522.90 అడుగుల వద్ద ఉంది. ప్రస్తుతం ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో స్థిరంగా కొనసాగుతోంది. వివిధ కాలువల ద్వారా 6,906 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు డ్యామ్ అధికారులు వెల్లడించారు. కుడి కాలువకు (6006cs) గరిష్ఠంగా నీటిని తరలిస్తున్నట్లు నాగార్జునసాగర్ ప్రాజెక్టు అధికారులు తెలిపారు.