కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు అమలాపురం పట్టణంలో నెంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న ద్విచక్ర వాహనాలను మంగళవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా పట్టణ సీఐ మాట్లాడుతూ.. మొదటిసారి పట్టుబడిన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి వాహనాలను తిరిగి అప్పగించామని తెలిపారు. మరోసారి పట్టుబడితే వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.