BPT: బక్రీద్ పండుగ నేపథ్యంలో బాపట్ల జిల్లాలో గోవధ, పశువుల అక్రమ రవాణాపై ఎస్పీ ఉమామహేశ్వర్ హెచ్చరించారు. వీటిని అడ్డుకునేందుకు 26 ప్రత్యేక బృందాలు, 4 క్యూఆర్టీలను రంగంలోకి దించారు. 6 సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఎవరూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవద్దని స్పష్టం చేశారు. అక్రమ రవాణాపై సమాచారం ఉంటే 112 నంబర్‌కు కాల్ చేయాలన్నారు.