HNK: జిల్లా రెవెన్యూ శాఖలో బదిలీల ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అదనపు కలెక్టర్ రవి, DRO శ్రీనివాస్, కలెక్టరేట్ AO గౌరీశంకర్ ఆధ్వర్యంలో ఈ మార్పులు జరిగాయి. 13 మంది సీనియర్ అసిస్టెంట్లు, 9 మంది జూనియర్ అసిస్టెంట్లు, నలుగురు నాయబ్ తహసీల్దార్లు, ముగ్గురు టైపిస్టులు, 12 మంది ఆఫీస్ సబార్డినేట్లకు స్థానచలనం కల్పించినట్లు అధికారులు వెల్లడించారు.