PLD: చిలకలూరిపేట మండలం దండమూడిలో మంగళవారం ఈదురు గాలులకు సోలార్ ప్లేట్లు ఎగిరిపడ్డాయి. దీంతో కౌశిక్(3), తరుణ్(10) అనే చిన్నారులకు తీవ్ర గాయాలయ్యాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం, నాసిరకం పనుల వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు మండిపడుతున్నారు. దీనికి కారకులైన బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.