నిర్మల్ సారంగాపూర్ మండలం అడెల్లి గ్రామంలోని మహా పోచమ్మ ఆలయంలో పురాతన విగ్రహాలను దేవాదాయశాఖ అధికారులు తొలగించడంపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ పునఃనిర్మాణ సమయంలో పోచమ్మ తల్లి విగ్రహంతో పాటు సప్త మాతృకల విగ్రహాలను బాలాలయంలో ఏర్పాటు చేశారు. కొత్త ఆలయంలో అమ్మవారి మూల విగ్రహాన్ని ప్రతిష్టించగా, మిగిలిన విగ్రహాలను తొలగించారు.