JGL: మెట్పల్లి మండలం వేంపేట్ గ్రామంలోని ఈత వనాన్ని దుండగులు తగలబెట్టిన ఘటనపై పోలీసులు మంగళవారం సాయంత్రం విచారణ చేపట్టారు. కొందరు దహనం చేయడంపై కల్లుగీత కార్మికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై కిరణ్ కుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి, వివరాలు సేకరించారు. నిందితులను త్వరలోనే గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై కిరణ్ కుమార్ తెలిపారు.