HYD: మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యంపై తప్పుడు ప్రచారం చేసిన ఓ యూట్యూబ్ ఛానల్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. చిరంజీవి తీవ్ర అనారోగ్యానికి గురైనట్లు, ఆయన ఫొటోలను మార్ఫింగ్ చేసి పరువు నష్టం కలిగించేలా కంటెంట్ ప్రసారం చేశారని ఒక న్యాయవాది ఫిర్యాదు చేశారు. స్క్రీన్ షాట్లు, వీడియో ఆధారాలతో ఇచ్చిన ఈ ఫిర్యాదుపై దర్యాప్తు చేస్తున్నారు.