GNTR: చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మంగళగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన 10.80 ఎకరాల భూమిని హ్యాండ్లూమ్ పార్కు ఏర్పాటు కోసం కేటాయించింది. ఈ భూములను మొత్తం 11 సంవత్సరాల పాటు లీజు ప్రాతిపదికన చేనేత పార్కుకు అప్పగిస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది.