HYD: నగరంతో పాటు సికింద్రాబాద్, కూకట్పల్లి, ఎల్బీనగర్ ప్రాంతాల్లో కురిసిన చిరుజల్లులతో ప్రజలకు ఎండలు, ఉక్కపోత నుంచి ఉపశమనం లభించింది. మరో 2-3 గంటల్లో రాష్ట్రంలోని 25 జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశముండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.