GNTR: ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా రోడ్ సేఫ్టీ ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. హెల్మెట్ లేకపోవడం, ట్రిపుల్ రైడింగ్, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటి ఉల్లంఘనలపై పోలీసులు 258 కేసులు నమోదు చేసి, రూ.1,13,605 జరిమానా విధించారు. బహిరంగ మద్యపానంపైనా చర్యలు తీసుకున్నామని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఇలాంటి తనిఖీలు మున్ముందు కూడా ఉంటాయని పేర్కొన్నారు.