WNP: గోపాలపేట మండలం పోలికేపాడు కాంగ్రెస్ కార్యకర్త అబ్దుల్లా తల్లి నాగమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే మెగారెడ్డి బుధవారం తమ స్వగృహానికి వెళ్లి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం కోసం తగుజాగ్రత్తలు వహించాలని ఆయన సూచించారు. సత్య శీలా రెడ్డి, సర్పంచ్ బంగారయ్య పాల్గొన్నారు.