BDK: ఆళ్లపల్లి మండలం పెద్ద వెంకటాపురం గ్రామ సర్పంచ్ ఉమా, ఉప సర్పంచ్ రాజేష్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ను ఇవాళ మర్యాదపూర్వకంగా కలిశారు. పెద్ద వెంకటాపురం గ్రామపంచాయతీలో నెలకొన్న పలు సమస్యలపై ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పంచాయతీకి కావలసిన మౌలిక సదుపాయాలన్నిటిని ఒక్కొక్కటిగా త్వరలో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.