W.G: పెదమైనవాని లంకకు చెందిన కరటాల బాలరాజు (33) రోజువారీ కూలీ పనుల నిమిత్తం నరసాపురం వస్తుంటాడు. మంగళవారం ఉదయం ఆయన పని కోసమని ఇంటి నుంచి బయలుదేరారు. టౌన్‌లోని ఓ బార్ వద్ద ఒక్కసారిగా స్పృహతప్పి కింద పడిపోయారు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించగా.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్ తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు SI జయలక్ష్మి కేసు నమోదు చేశారు.