కోనసీమ: కాలువలకు నీరు విడుదల చేసే సమయానికి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అధికారులను ఆదేశించారు. ఆయన మంగళవారం రామేశ్వరం, గొంది, టేకిశెట్టిపాలెం, మలికిపురం, శివకోటి, సోంపల్లి, పొదలాడ గ్రామాలలో కాలువల పూడికతీత, అభివృద్ధి పనులను, ఎన్డీఏ కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. పనులు పారదర్శకంగా నిర్వహించాలని చెప్పారు.