ప్రకాశం: పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కలెక్టర్ పి. రాజాబాబు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఈ నెల 29వ తేదీన కొరిశపాడు మండలం, పి.గుడిపాడు గ్రామంలో ఆయన పల్లెనిద్ర కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. కలెక్టర్‌తో పాటు జిల్లా స్థాయి అధికారులు అందరూ ఈ పర్యటనలో పాల్గొంటారు. క్షేత్రస్థాయిలోనే సమస్యలను పరిష్కరించేందుకు అధికారుల బృందం సిద్ధంగా ఉంటుందని తెలిపారు.