BPT: చీరాల పట్టణ ప్రజల భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు చేపడుతోందని చీరాల వన్‌టౌన్ సీఐ జి.సోమశేఖర్ తెలిపారు. పట్టణంలో నిఘాను తీవ్రతరం చేశామని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ‘శిరోరక్ష-ప్రాణరక్ష’ కార్యక్రమాన్ని విస్తృతం చేశారు.