తన కూతురు అనన్య పాండే డ్యాన్స్‌పై వచ్చిన ట్రోల్స్‌పై నటుడు చంకీ పాండే స్పందించాడు. ‘చాంద్ మేరా దిల్’ మూవీలోని ఒక సీన్ చూసి జడ్జ్ చేయొద్దన్నాడు. అందులో చేసింది భరతనాట్యం కాదని, విద్యార్థులు చేసే ఫ్యూజన్ డ్యాన్స్ అని స్పష్టం చేశాడు. నెటిజన్లు అపార్థం చేసుకున్నారని, సినిమా చూశాక రియాక్ట్ అయితే బాగుంటుందని పేర్కొన్నాడు.