కృష్ణా: గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారా మంగళవారం 48 విమాన సర్వీసులు ప్రయాణించాయని ఎయిర్పోర్ట్ డైరెక్టర్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. వీటిలో 24 సర్వీసుల ద్వారా 2,005 మంది ఈ విమానాశ్రయంలో దిగారని, ఇక్కడ నుంచి 1,833 మంది 24 సర్వీసులలో ప్రయాణించారని పేర్కొంది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆయా సర్వీసుల సేవలను అందిస్తామని వెల్లడించింది.