TG: వచ్చే నెల జూన్ 3న సీఎం రేవంత్ రెడ్డి కోహెడలో పర్యటించనున్నారు. సమీకృత మార్కెట్ భవనానికి ఆయన శంకుస్థాపన చేయనున్నారు. 239 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నిర్మాణానికి ఏర్పాట్లు చేశారు. సీఎం కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీసులు ఇప్పటినుంచే చర్యలు చేపట్టారు.