TG: రాష్ట్రంలోని పలు జిల్లాలకు వర్ష సూచన ఉన్నట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలోనే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. గంటలకు 40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి. రంగారెడ్డి, వికారాబాద్లో భారీ గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.