ఉదయాన్నే నిద్రలేవడం వల్ల మన శరీరం, మనస్సు ఆరోగ్యంగా ఉంటాయి. ఏకాగ్రత పెరుగుతుంది. రోజంతా ఉల్లాసంగా, శక్తివంతంగా పని చేయడానికి కావలసినంత సమయం దొరుకుతుంది. ఉదయం పూట ప్రశాంతమైన వాతావరణం ఒత్తిడిని, ఆందోళనను తగ్గిస్తుంది. మెదడు చురుగ్గా పనిచేయడంతో పాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఉదయం 5 గంటలకు నిద్ర లేవడం మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.