PPM: కొమరాడ మండలం కోనవలస గ్రామ సమీపంలో బుధవారం ఏనుగుల గుంపు సంచరించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. గ్రామ పరిసరాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి సమయంలో పొలాలవైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏనుగుల కదలికలను ఎలిఫెంట్ ట్రాకర్స్ నిరంతరం పర్యవేక్షిస్తున్నారని అధికారులు వెల్లడించారు.