GNTR: తాము చట్టబద్ధంగా ప్రతిపక్ష హోదా అడుగుతుంటే ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతోందని వైసీపీ ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్‌రెడ్డి విమర్శించారు. తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో మంగళవారం మాట్లాడిన ఆయన.. జగన్ ఆధారాలతో లేవనెత్తుతున్న ప్రజా సమస్యలకు సమాధానం చెప్పలేకనే కూటమి నేతలు వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని మండిపడ్డారు.